తెలంగాణలో బీజేపీ  పాదయాత్రలు
ఐదు జిల్లాల్లో ఐదు లక్షల మంది కార్యకర్తలతో పాదయాత్రలకు ప్రతిపాదన
వెల్లడించిన బీజేపీ సీనియర్ నేత పెరిక సురేష్
హైదరాబాద్ : తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణకు సిద్ధమవుతోందని ఆపార్టీ సీనియర్ నేత పెరిక సురేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో భారీ స్థాయిలో మహా పాదయాత్రలు నిర్వహించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. శుక్రవారంఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కలిసి చర్చించినట్లు పార్టీ నేత సురేష్ వెల్లడించారు.
ఇటీవల కరీంనగర్‌లో లక్ష మంది కార్యకర్తలతో నిర్వహించిన మహా పాదయాత్ర, హైదరాబాద్లో నిర్వమించిన నషా ముక్త్ భారత్ పాదయాత్రలు విజయవంతమైన నేపథ్యంలో.. అదే తరహాలో రాష్ట్రంలో మరో ఐదు ఉమ్మడి జిల్లాల్లో భారీ పాదయాత్రలు చేపట్టాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒక్కో జిల్లాలో లక్ష మంది కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.


మొత్తం ఐదు జిల్లాల్లో ఐదు లక్షల మంది కార్యకర్తలను సమీకరించి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నట్లు సురేష్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text