MUMBAI, INDIA – MAY 28 : Kamal Hassan attends the trailer launch ‘Vikram Hitlist’ on May 28, 2022 in Mumbai, India. (Photo by Prodip Guha/Getty Images)

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించక పోవడంపై కమల్ మండిపడ్డారు. ఆదివారం (మే 28) ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బెల్లవిస్టా ప్రారంభం కానుంది. అయితే, అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి పిలవకుండా, ప్రధాని మోడీనే ప్రారంభోత్సవం చేస్తుండడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. 

తాజాగా, సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ ఈ అంశంపై స్పందించారు. జాతికి గర్వకారణంగా భావించాల్సిన ఈ క్షణాలు రాజకీయ విభజనకు దారితీశాయని విమర్శించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు పిలవడంలేదు అని మోడీని ప్రశ్నించారు. 

దేశాధినేతగా ఉన్న వ్యక్తి చారిత్రక కార్యక్రమానికి హాజరుకాక పోవడానికి తనకేమీ కారణం కనిపించడంలేదని కమల్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల రీత్యా కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని తాను ఆమోదిస్తానని, కానీ రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text