బెంగళూరు, మే 29
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్ ని వైయస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ఉదయం బెంగళూర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని..కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని షర్మిల డి కె ను అభినందించారు.మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తో ఉన్న సాన్నిహిత్యాన్ని డి కె శివకుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.