
*సూపర్ శాలరీ అకౌంట్‌గా మార్పు
*కార్మికులందరికీ రూ. 55 లక్షల ఉచిత ప్రమాద బీమా
*రూ.315 ఇన్స్ రెన్స్ కడితే మరో 30 లక్షల ప్రమాద బీమా
హైదరాబాద్, జూన్ 22
యూనియన్ బ్యాంక్ తో సింగరేణి గురువారం కీక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నారు. యూనియన్ బ్యాంకు అకౌంట్‌లను సూపర శాలరీ అకౌంట్ గా మారుస్తున్నారు. వీరందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నరు. సింగరేణి వ్యాప్తంగా యూనియన్ బ్యాంకులో ప్రస్తుతం 11,182 మంది కార్మికుల అకౌంట్‌లు ఉన్నాయి. వీటికి ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా సూపర్ శాలరీ అకౌంట్లుగా మార్చాలని నిర్ణయించారు. దీంతో ప్రతి కార్మికునికి ఉచితంగా రూ.55 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయనున్నారు. నెలకు కనీసం రూ.25 వేల నుంచి రూ.75 వేల గ్రాస్ సాలరీ పొందుతున్న ఉద్యోగులకు, అంతకు పైబడి సాలరీ ఉన్న వారికి ఈబీమా సౌకర్యం వర్తిస్తుంది.


సూపర్ శాలరీ అకౌంట్ ఉన్నందుకు 40 లక్షల ఇన్సూరెన్స్ పథకం, 5 లక్షల బ్యాంక్ ఇన్సూరెన్స్ తో పాటు ఏటీఎం రూపే కార్డు ఇన్సూరెన్స్ ద్వారా రూ.10 లక్షల మొత్తం కలిపి 55 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం కింద చెల్లిస్తారు. అదే విధంగా ఉద్యోగి రూ.315 సాధారణ ప్రమాద ఇన్స్రెన్స్ స్కీమ్ కింద వార్షిక ప్రీమియమ్ చెల్లిస్తే ఆ పథకం కింద అదనంగా రూ.30 లక్షల ప్రమాద బీమా సొమ్ము చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా ఇటీవల మృతి చెందిన సింగరేణి కార్మికులకు ఈ రెండు పథకాల కింద గరిష్టంగా రూ.78 లక్షలు చెల్లించడం జరిగింది.

ఈ ప్రమాద బీమా సౌకర్యంతో పాటు మరో 22 రకాల అదనపు ప్రయోజనాలు కల్పించనున్నారు.
ఏడాదికి మెడిక్లెయిమ్ ఆసుపత్రి ఖర్చుల కింద 15 వేల రూపాయలు చెల్లింపులు, ఉచిత చెక్ బుక్ సౌకర్యం, బ్యాంకు లాకర్స్ వినియోగంలో 25 నుండి 50 శాతం రాయితీ, రూ.25 లక్షలు అంతకన్నా పైబడి తీసుకునే రుణాలకు పూర్తి శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, రూ.25 లక్షల కన్నా తక్కువ రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజులో సగం రాయితీ, గృహ నిర్మాణానికి సింగరేణి కార్మికులు తీసుకునే రుణంపై రాయితీ, వ్యక్తిగత రుణం, వాహన రుణం, విద్యా రుణాల పైన రాయితీలు, ఏటీఎం కార్డు వినియోగంలో రాయితీల వంటి అనేక ప్రయోజనాలు కలిగించే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద రాయితీలు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా 70 ఏళ్ల వయస్సు వరకు అమలు చేయటానికి అంగీకరించారు. దీనివల్ల రిటైర్డ్ కార్మికులు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది.
