
ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన
హైదరాబాద్, జూన్ 21:
ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర నేతృత్వంలోని ఉన్నతాధికారులు బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.

ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఎన్నికల్లో శాంతి భద్రతలతో పాటు ఇతర అంశాలకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆదాయపు పన్ను అధికారులతో, ఎన్‌సీబీ, ఎక్సైజ్ శాఖ, రాష్ట్ర జీఎస్టీ, సీజీఎస్టీ, ఈడీ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, డీఆర్‌ఐ, ఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం కానున్నారు.
