
.ఎల్బీనగర్లోని కమ్యూనిటీ హాల్లో జేఏసీ సమావేశం
.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి హాజరు కానున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
హైదరాబాద్, జులై 22
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ మహానగరంలో మహాసభ నిర్వహిస్తున్నారు. ఎల్బీనగర్లోని శాతవాహన నగర్ కమ్యూనిటీ హాల్ లో జరిగే ఈ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మహాసభ పోస్టర్ ఆవిష్కరించి కార్యచరణ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాతుందని స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్స్ ఇవే..
#మూడు సంవత్సరాల కాలపరిమితి పైబడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే బేషరతుగా రెగ్యులర్ చేయాలి.
#సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడంతో పాటు సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లించాలి (జి.ఓ.నెం. 16 ప్రకారం)
#మూడేళ్ల కాలపరిమితి లోపున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, ఏజెన్సీలను రద్దు చేసి, ప్రభుత్వమే నేరుగా వేతనాలు అందించాలి.
#రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సహాయం అందించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి.
#ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
పీఆర్సీపై బిస్వాల్ కమిటీ సిఫారసు ప్రకారం ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ కల్పించాలి.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ చేయడం గాని, తీసివేయడం గాని చేయకూడదు.
తేది : 23-07-2023 ( ఉదయం: 11-00 ఆదివారం), వేదిక : శాతవాహన నగర్ కమ్యూనిటీ హాల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, రోడ్ నెం. 3-ఎల్.బి.నగర్, హైదరాబాద్

ఖమ్మం లో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ..
తెలంగాణ ఔట్ సోర్సింగ్ జేఏసీ మహాసభ పోస్టర్ ను ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ నాయకులు ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ నాయకులు అఫ్జల్ హసన్, నందగరి శ్రీను, నాగుల్ మీరా, ప్రసాదరావు, జ్యోతి, స్వప్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బిందు ప్రసాద్, నవీన్, హరీశ్, పాషా, సుమంత్, ఖలీలా పాషా తదితరులు పాల్గొన్నారు
