
మంత్రికి విస్తరణ అధికారుల సంఘం వినతి
హార్టీకల్చర్ ఎంప్లాయిస్‌ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 09
హార్టీకల్చర్ ఉద్యోగులను వెంటనే రెనివల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యానశాఖ విస్తరణ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంఘం ప్రతినిధి బృంధం మినిస్టర్స్ క్వార్టర్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం ప్రెసిడెంట్ బొల్లుసైదులు, జనరల్ సెక్రటరీ బండి వేణుకుమార్, సంధ్య జోషి మాట్లాడుతూ కరోనా కాలం నుంచి హార్టీకల్చర్ శాఖ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లను (హెచ్‌ఈవో) రెనివల్ చేయకుండా నిలిపి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నిధులు లేవనే కారణంతో దశాబ్ధాల తరబడి సంస్థలో పనిచేస్తున్న హెచ్‌ఈవోలను రెవివల్ నిలిపివేయడంతో వయస్సు పైబడి వేరే ఉద్యోగాలు చేయలేక, కుటుంబాలు పోషించలేక ఇబ్బందులకు గురవుతున్నాయని మంత్రికి గోడు వెల్లబోసుకున్నారు. తమపై దయతలచి తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని ఆదుకోవాలని కోరారు.
సంఘం ప్రతినిధుల అభ్యర్థనపై మంత్రి నిరంజన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో రెనివల్ చేసేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వంటకపు విశ్వనాథ్‌రెడ్డి, బ్యాగరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
