
హైదరాబాద్, ఆగస్టు 11:
జీ వీ ఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ఈనెల 14 నుండి 18వ తారీకు వరకు యోగాలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు అప్లై చేసుకోవాలని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ గోపాల్ రెడ్డి తెలిపారు. ప్రముఖ యోగ తెరపిస్ట్ రేవతి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ శిక్షణ తరగతులలో అధిక బరువు నియంత్రణ, థైరాయిడ్ నియంత్రణ, వెన్నుపూస ను ధృఢ పరిచే వివిధ రకాల ఆసనాలను శిక్షణ కల్పించడం జరుగుతుంది.

ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆసక్తి గలవారు పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. వివరాలు కొరకు
8978114086 మొబైల్
నెంబర్ ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని గోపాల్ రెడ్డి తెలిపారు.
