
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలి
6లక్షల కుటుంబాలను ఆదుకోవాలి
జేఏసీ పిలుపు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల “ ఆత్మీయ సమ్మేళనం ”
హైదరాబాద్, ఆగస్టు 13
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేసి 6 లక్షల కుటుంబాలకు మేలు జరిగే విధంగా న్యాయం చేయాలని రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ పిలుపునిచ్చింది. ఆదివారం రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో 33 జిల్లాల నుంచి 10వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు “ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం” లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వరంగాలలో, శాఖలలో, సంస్థలలో పనిచేస్తున్న 1.50లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ (గ్రామా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు) తక్షణమే రెగ్యులర్ చేసి, ప్రభుత్య ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా జేఏసీ డిమాండ్ చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని సమ్మేళనం రాష్ట్ర సర్కారును కోంది. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకుంటున్న ఏజెన్సి వ్యవస్థని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. గవర్నమెంట్ సకాలంలో వేతనాలు ఇచ్చినా, ఈ ఏజెన్సీలు నెలలు తరబడి వేతనాలు చెల్లించకుండా, పీఎఫ్,ఈఎస్‌ఐ ఉద్యోగి ఖాతాలో జమచేయకుండా ఉద్యోగులని వేదిస్తూ, తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజెన్సి వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నామని తెలిపారు. కరోన వంటి విపత్కర పరిస్థితిలో కుడా ప్రాణాలు పణంగా పెట్టి, కుటుంబాలకి దూరంగా ఉండి సేవలు అందించామని గుర్తు చేశారు. చాలీ చాలని జీతాలతో ప్రభుత్వపక్షాన ప్రజలకు సేవలు అందించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను గుర్తిస్తూ , ప్రభుత్వంలో తక్షణమే విలీనం చేయాలనీ ఆత్మీయ సమ్మేళనం వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈ కార్యక్రమం జేఏసీ నాయకులు లక్ష్మయ్య, సంతోష్, వినోద్, శ్రీధర్, జగదీష్, రాజురెడ్డి, అరుణ్, నారాయణ, కృష్ణ, బిందుప్రసాడు, విజయలక్ష్మి, సునీత,సంధ్య, నాజరు, రాజమ్మధు, శ్రీనాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్స్ ఇవే
.మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తియిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలి.(శాంక్షన్ పోస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ పెండిచర్, ఇతర గ్రాంట్ ల ద్వారా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అందరినీ).
.మూడు సంవత్సరాల కాలపరిమితి లోపు ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏజెన్నీ లను రద్దు చేసి, ప్రభుత్వమే నేరుగా ప్రభుత్య ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి.
.రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
.రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5.00 లక్షల ఆర్ధిక సహాయం చేస్తూ, వారి కుటుంబలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.
.ఉద్యోగులను ఇష్ట రీతిన బదిలీలు చేయకూడదు. ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా తొలగించకూడదు.
.2020 పీఆర్‌సీ ప్రకారం బకాయిలు అందరికి తక్షణమే చెల్లించాలి, అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి 2023 పీఆర్‌సీ ప్రకారం జూలై 2023 నుంచే వేతనాలు ఇవ్వాలి.

