
సోమవారం రూ.6,546.05 కోట్లు విడుదల
లక్ష వరకు మాఫీ చేయాలంటే ఇంకా రూ.11,445 వేల కోట్లు కావాలే
ఇప్పటి వరకు 16.66లక్షల మందికి రైతులకు రుణమాఫీ
రూ.7753.43కోట్లు మాఫీ
తాజాగా 10.79లక్షల మందికి మాఫీ చేసిన సర్కారు
ఒక్క రూపాయి అయితే రూ.11వేల కోట్లు కావాలే
ఇంకా 14.34లక్షల మందికి మాఫీ చేయాలే
హైదరాబాద్, ఆగస్టు 14
రాష్ట్ర రైతాంగానికి రూపాయి తక్కువ లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. తాజాగా రుణమాఫీ కోసం రూ.6,546.05 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం 10లక్షల 79వేల 721 మంది రైతులకు సంబంధించి ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీచేశారు. తాజా నిధులు విడుదల చేయడంతో 16.66లక్షల మందికి రైతులకు సంబంధించి 99వేల 999 రూపాయలకు సంబంధించిన రుణాలు రూ.7753.43కోట్లు మాఫీ చేసినట్లయింది.
రూ.లక్ష వరకు ఉన్న రుణాలే ఎక్కువ
రైతులు, వారి కుటుంబసభ్యులపై కలిపి మొత్తంగా రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.గత 2018 డిసెంబర్ 11ను కటాఫ్ తేదీగా నిర్ణయించింది. నిర్ణీత తేదీ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.25,936 కోట్ల లోన్లు ఉన్నట్లు ఎస్‌ఎల్‌బీసీ తేల్చింది. గత రెండేళ్ల క్రితం అయితే అందులో పంట రుణాలు, ఫ్యామిలీకి రూ.లక్ష మాఫీ నిబంధనల అమలులో 3 .98లక్షల మందికి పైగా అనర్హులుగా తేలింది. రాష్ట్రంలో మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన లక్ష రూపాయల వరకు రూ.19198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. కాగా తాజాగా ఒక్క రూపాయి తక్కువ లక్ష మాఫీ రుణాల మాఫీ కోసం విడుదల చేసిన నిధులతో ఇప్పటి వరకు 16.66లక్షల మందికి రైతులకు రూ.7753.43కోట్లు మాఫీ చేసినట్లయింది. ఇంకా లక్ష వరకున్న పంట రుణాలు మాఫీ చేయాలంటే 20లక్షల మంది రైతులకు సంబంధించి ఇంకా రూ.11,445.95 కోట్లు చేయాల్సి ఉంటుంది.
రుణమాఫీ నిధుల విడుదల ఇలా..
లక్ష రూపాయల రుణమాఫీలో నాలుగు దఫాలుగా చేయాలని సర్కారు నిర్ణయించింది. కాగా ఫస్ట్ ఫేజ్‌లో రూ.25వేల వరకు 2.96లక్షల మంది రైతుల రుణాలు రూ.408.38కోట్లు మాఫీ జరిగింది. సెకండ్ ఫేజ్‌లో 2.70లక్షల మంది రైతులకు 36వేల వరకు ఉన్న రూ,770.40 కోట్ల రుణాలు మాఫీ జరిగింది. ఇలా మరి కొందరి మాఫీ జరుగుతూ ఈ నాలుగున్నర ఏళ్లలో ఇప్పటి వరకు 5.66లక్షల మంది రైతుల రుణాలు రూ.1,207 కోట్లు మాత్రమే మాఫీ జరిగింది. ఆగస్టు 3న 41వేల లోపు రుణాలున్న 62వేల 758 మంది రైతులకు సంబంధించి రూ.237. 85 కోట్లను విడుదల చేశారు. అలాగే, ఆగస్టు 4న 43వేల లోపు రుణాలున్న 31వేల 339 మంది రైతులకు సంబంధించి రూ.126.50కోట్ల రుణాలను మాఫీ చేస్తూ నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తాజాగా 99వేల 999 వరకు ఉన్న 10లక్షల 79వేల 721 మంది రైతులకు సంబంధించి రూ.6,546.05 కోట్లను విడుదల చేసింది. ఇంకా 20లక్షల మంది రైతులకు సంబంధించి రూ.11,445.95 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది.