
ప్రకృతి ప్రియులు ఫిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 4
నెక్లెస్‌రోడ్ పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్‌షో ప్రకృతి ప్రియులను ఆకట్టకుంటోంది. 14వ మెగా నర్సరీ మేళాలో లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న వర్టీకల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్, టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ ఈ షో లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్రా తదితర నగరాలు, ప్రాంతాల నర్సరీల నుంచి వచ్చిన మెక్కలు, ఉత్పత్తులను 150 స్టాల్స్ ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. రకరకాల పూల మొక్కలు, వివిధ రకాల పండ్ల మొక్కలు గార్డెనింగ్ ఔత్సాహికులను అమితంగా ఆకట్టకుంటున్నాయి.

కాంక్రీట్ జంగిల్, బీజీలేఫ్‌లో ఉండే నగర వాసులకు గార్డెనింగ్ హ్యాబీగా చేసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయని హార్టీకల్చర్ ఇంచార్జ్ ఖాలీద్ అహ్మద్ అన్నారు. ఈ షో లో జాతీయ, అంతర్జాతీయ రకాల నర్సరీమొక్కలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. విరబూసే క్రీసెంట్‌మమ్, స్విజ్జర్‌ల్యాండ్, నెదర్లాండ్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న జర్బెరీ, తులిప్, ఎగ్జెటిక్ పూలు, పండ్లు మొక్కలు, అగ్రికల్చర్, హార్టీకల్చర్‌కు అవసరమైన ఈక్విప్‌మెంట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మట్టి లేకుండా కేవలం నీటిలో పెరిగే వెజ్‌టబుల్స్, ఫ్రూట్, ఫ్లవర్ ప్లాంట్స్, బల్బ్స్ ప్రదర్శించారు. షో మంగళవారం రాత్రి 9గంటల వరకు నగర ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని తెలిపారు.

Beautiful ❤️ Bagunadi good