
నాణ్యమైన ఉత్పత్తులు వాడితేనే అధిక దిగుబడులు
హైదరాబాద్, సెప్టెంబరు 03
రైతులకు అధిక దిగుబడితో సాగు లాభసాటిగా మార్చేందుకు నాణ్యమైన ఉత్పత్తులు ఉపయోగించాలని కేంద్ర మాజీమంత్రి, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ఆల్వాల్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో హార్మోనీ ఎకోటెక్ ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు అవసరమైన అగ్రి ఇన్ పుట్స్ – మైక్రో న్యూట్రియెన్ట్స్, నీటిలో కరిగే ఎరువులు, బయో ఫర్టిలైజర్లు, బయో పెస్టిసైడ్లు, బయో స్టిములెంట్లు, గ్రోత్ ప్రమోటర్లు, హెర్బిసైడ్లు, ఫంగిసైడ్లు, ఇన్సెక్టి సైడ్లు అందుబాటులోకి రావడాన్ని అభినందించారు. ఆర్గానిక్, ఇనార్గానిక్, నాన్ కెమికల్, కెమికల్ ఇన్ పుట్స్ అన్నింటినీ రైతుకి అందుబాటులోకి తీసుకురావడమనేది చాలాఅరుదుగా ఉందన్నారు. నాణ్యమైన ఉత్పతుల్ని అతితక్కువ ధరల్లో రైతులకు అందించాలని సూచించారు.




ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో పెట్టిన పెట్టుబడి రావడంలేదన్నారు. కూలీల కొరత, నకిలీ విత్తనాలు, నాణ్యతా లోపాలతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. మద్దతు ధర అందక, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ సౌలభ్యం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతుకు ఉపయోగపడే నాణ్యమైన ఉత్పత్తుల్ని, అతి తక్కువ ధరల్లో అందించడంతోపాటు సరైన సమయంలో సలహాలు, సహకారం ఇస్తే, వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హార్మోనీ ఎకోటెక్ డైరెక్టర్స్ నరసింహారావు తోలేటి, పెన్మత్స విజయవరసింహరాజు, ఐవీఎం స్వరూప్, పెన్మత్స హర్షవర్ధన్, నడింపల్లి శ్రీను,పెన్మెత్స శేఖర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.


