
ఎన్నికల షెడ్యూల్ విడుదల
అక్టోబరు 28న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు
అక్టోబరు 6,7 తేదీల్లో నామినేషన్లు
అక్టోబర్ 28న ఎన్నికలు.. అదే రోజు కౌంటింగ్
హైదరాబాద్, సెప్టెంబరు 27
సింగరేణిలో ఎన్నికల నగరా మోగింది. బుధవారం సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ ఛీప్ లేబర్ కమిషనర్ డీ.శ్రీనివాస్‌లు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గత మే 22న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యంకోరింది. సింగరేణి అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు అక్టోబరులోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది.
నోటిఫికేషన్ వివరాలు ఇవే
సెప్టెంబరు 30
డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రకటన
అక్టోబరు 3
ఓటరు లిస్ట్‌పై అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 4
సాయంత్రం 5గంటలకు అభ్యంతరాలపై నిర్ణయం
అక్టోబర్ 5
ఫైనల్ ఓటర్ లిస్టు ప్రదర్శన
అక్టోబరు 6, 7
నామినేషన్ల స్వీకరణ
అక్టోబరు 9
సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల విత్‌డ్రా
అక్టోబరు 10
ఉదయం 10AM=1PM వరకు స్క్రూటినీ
మధ్యాహ్నం 2PM= 5PM వరకు గుర్తులు కేటాయింపు
అక్టోబరు 28
ఉదయం 7AM= 5PM ఓటింగ్
7PM నుంచి ఓట్ల లెక్కింపు
