
రూ.11కోట్లు కట్టాలని కొమురవెల్లి మల్లన్నకు నోటీసులు!
ఇన్‌కంటాక్స్ కట్టాలంటూ ఆలయాలకు ఐటీ నోటీసులు
కొమురవెల్లి మల్లన్నకు రూ. 3 కోట్ల ఫైన్
వేములవాడ, బాసర దేవాలయాలకు నోటీసులు
హైదరాబాద్, అక్టోబరు 05
తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు అందించింది. ఈ లిస్ట్‌లో కొమురవెల్లి మల్లన్నకు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. రూ.8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, టైమ్‌కు టాక్స్ కట్టలేదనీ, దీనికి మరో రూ. 3 కోట్లు ఫైన్ చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వెములాడ రాజన్న, బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు పలు దేవాలయాలకు ఐటీశాఖ నోటీసులు అందాయి. ఆలయాలకు ఐటీ నోటీసులు అందడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడా వ్యాపార సంస్థలు, కంపెనీలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించిన తీరు మాదిరిగానే టెంపుల్స్ పై కఠిన వైఖరి సమంజసం కాదని పలువురు భక్తులు, ధార్మిక సంస్థలు అంటున్నాయి.