
సెల్ఫ్ డిఫెన్స్ సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ఎస్పీ
హైదరాబాద్, అక్టోబరు 05
మొబైల్ గేమ్స్ కంటే ప్లేగ్రౌండ్ ఆటలను ప్రోత్సహించాలని తెలంగాణ పోలీస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ పీవీ పద్మజ అన్నారు. గురువారం హైదరాబాద్ రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాలలో ఆత్మరక్షణ శిక్షణ సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు ఐపిఎస్ పద్మజ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మజ మాట్లాడుతూ టెక్నాలజీని సరైన మార్గంలో వాడాలని టెక్నాలజీ లో ఉన్న మంచి కన్నా చెడుని ఎక్కువ వాడుతున్నారని విమర్శించారు. ప్రతి బాలికకు స్వీయ రక్షణ తరగతులు ఎంతో అవసరం అని అపాయంలో ఉపాయం రావాలంటే దేహదారుఢ్యం అవసరం అని చెప్పారు. ప్రతి కాలేజీల్లో ఇలాంటి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం ఎంతో అవసరమన్నారు. ప్రతి బాలికలకు షీ టీమ్స్ నీడగా ఉంటదని ఎవరు ఏ ఆపదలో ఉన్న తోడుగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ బి వి ఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అచ్యుతాదేవి కోఆర్డినేటర్ మంజుల సెల్ఫ్ డిఫెన్స్ ట్రెయినర్ జీవిఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై శిరీష, ఝాన్సీ లక్ష్మి, డాక్టర్ బిందు, తదితరులు పాల్గొన్నారు.