
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియామెంబర్ పెరిక సురేష్
హైదరాబాద్, జనవరి 25
ఇండియా కూటమి పతనం ప్రారంభమైనీ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ పేర్కొన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా 1008 దంపతులతో9 రోజుల పాటు నిర్వహించిన శ్రీరామ హనుమాన్ మహాయజ్ఞం మహాప్రసాదాన్ని, ప్రతిమను అందించారు.

అనంతరం సురేష్ మాట్లాడుతూ… రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. ఇండియా కూటమీ పతనం ప్రారంభమైందన్నారు. ఇప్పటికే ఆప్ పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించిందన్నారు. తాజాగా తృణమాల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరీగా బరీలోకి దిగుతుందని చెప్పిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్య ఆలయ నిర్మాణం నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో రాబోయే లోక్‌సభ ఎన్నికలు రామరావణ యుద్దం కాగలదని అన్నారు. రాష్ట్రంలో 10 స్థానాలకు పైగా బీజేపీ గెలుస్తుందని పెరిక సురేష్ ధీమా వ్యక్తం చేశారు.