
ఫిబ్రవరి 1 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా
*ఐదు రోజుల పాటు ఆల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో
*నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన
*బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జనవరి 26
పచ్చదనంతోనే ప్రజల మనుగడ సాధ్యమనీ, భావి తరలా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో 15వ గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్ ను మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో అల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో ఫిబ్రవరి 1నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ షో లో హార్చీకల్చర్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులు ప్రదర్శిస్తారనీ తెలిపారు.
హైడ్రోఫోనిక్, టెర్రస్ గార్డెనింగ్, వర్టీకల్ గార్డెనింగ్ వంటి నూతన టెక్నాలజీ ఈ షోలో ప్రదర్శిస్తారని చెప్పారు. దేశ వ్యాప్తంగా 150కు పైగా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారనీ తెలిపారు. ప్రధానంగా డార్జిలింగ్, కోల్ కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్ ప్రదర్శిస్తారు.
మేళా ఇంచార్జ్ ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ నెక్లెస్ రోడ్ లో ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అందుబాటులో ఉంటాయి. సౌది అరేబియా నుంచి వచ్చిన టిష్యూకల్చర్ వెరైటీ డేట్ ఫామ్ ప్రత్యేక అందుబాటులో ఉంటుందని వివరించారు.
