
పెరిక సురేష్ ఎక్కడ పోటీ చేసినా జాతీయ బీసీ సంక్షేమసంఘం మద్దతు: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, జనవరి 26
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు అన్ని పార్టీలు అధికంగా సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ ఆర్ కృష్ణయ్యను కలిసి అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా 1008 దంపతులతో9 రోజుల పాటు నిర్వహించిన శ్రీరామ హనుమాన్ మహాయజ్ఞం మహాప్రసాదాన్ని, ప్రతిమను అందించారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ జనగణన నిర్వహించి ఈ వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించాలన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పెరిక సామాజిక వర్గానికి చెందిన సురేష్ లాంటి యువ, బీసీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. విద్యావంతుడిగా, ధార్మిక నేతగా మంచి పేరున్న బీసీ నేత సురేష్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మద్దతు తప్పక ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్దమని అన్నారు. నల్గొండ నుంచి పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పేరిక సురేష్ ప్రకటించారు.