

ఈ మల్క మల్కకే మల్కాజిగిరి?
పావులు కదుపుతున్న ఆర్ ఎస్ ఎస్
రాజేందర్, మురళీధర్ లకు చెక్
హైదారాబాద్, ఫిబ్రవరి 26
ఈ సారి మల్క కోమురయ్యకే బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ సీటు ఖాయం అయినట్లు తెలుస్తోంది.. తాజగా తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధిష్టానం షెడ్యూల్ కంటే ముందే లోక్ సభ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక్కడ టికెట్ రేసులో మురళీధర్ రావు, ఈటెల రాజేందర్, మల్క కొమురయ్య ముందు వరుసలో ఉన్నారు. ఎవరికి వారే టికెట్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఎస్ అండ దండలు పుష్కలంగా ఉన్న మల్క కొమురయ్యను అధిష్టానం సోమవారం రోజు ఢిల్లీ నుంచీ పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది. సాయంత్రం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ప్రముఖులను కలిసే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మురళీధర్ రావు, ఈటెలకి కాకుండా మధ్యే మార్గంగా కొమురయ్య కు టికెట్ దక్కొచ్చనే చర్చ ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో పక్కా మల్క కోమురయ్య కే టికెట్ దక్కేలా వుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.



