టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. పుష్ప మూవీలో అల్లు అర్జున్ స్టైల్ కి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ మూవీలో పుష్పరాజుగా అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జనసేన సైనికులు మండిపడుతున్నారు. జనసేన అభిమానుకులకు ఆగ్రహం తెప్పించేలా అల్లు అర్జున్ ఏం చేశాడు..
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి ప్రస్తుతం పిఠాపురం నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని సపోర్టు చేస్తూ ఆయన ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నాగబాబు, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు పిఠాపురంలో ప్రచారాలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడిని గెలిపించాలంటూ వీడియోని రిలీజ్ చేశారు. జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి కమెడియన్స్ సైతం పవన కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. రీసేంటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ ని సపోర్టు చేస్తూ ఒక పోస్ట్ విడుదల చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన పవన్ కళ్యాణ్ చూసి తాను గర్వపడుతున్నాను అని అల్లు అర్జున్ అన్నారు. రాజకీయాల్లో మీరు అనుకున్నది సాధించాలంటూ ఒక కుటుంబ సభ్యునిగా ఎల్లప్పుడూ సపోర్టు మీకే ఉంటుందని అన్నారు.
ఒకవైపు జనసేన గెలుపు కోసం మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు. మరోవైపు నంద్యాలలో అల్లు అర్జున్ తన భార్య స్నేహాలత రెడ్డితో కలిసి తన మిత్రుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ నంద్యాలకు రావటంతో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి భారీగా చేరుకుని భారీ గజమాలతో స్వాగతం పలికారు. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ తన మిత్రుడు శిల్పా రవిచంద్ర రెడ్డి నంద్యాల నుంచి వైసీపీ తరపున గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. శిల్పా రవిచంద్ర రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు వారానికి పక్కాగా కలిసేవాళ్ళం. ఇప్పుడు తను రాజకీయాల్లో బిజీగా వుండటంతో ఆరు నెలలకు ఒకసారి కలుస్తున్నాం అని అన్నారు.
నంద్యాలలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర రెడ్డికి అల్లు అర్జున్ సపోర్టు చేయటంతో జనసేన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత మామ అయిన పవన్ కళ్యాన్ కి కేవలం ఒక పోస్ట్ పెట్టి, మిత్రుడు అయిన శిల్పా కోసం నేరుగా నద్యాలలోని ఆయన ఇంటికి వెళ్లి మరి అతను గెలవాలని చెప్పటం పట్ల దుమారం రేపుతోంది. ఒక మనస్సు ఆడియో పంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల చేస్తుంటే పవన్ పేరు చెప్పనంటూ అల్లు అర్జున్ మాట్లాడిన మాటల పట్ల ఇప్పటికి జనసేన అభిమానులకు కోపం ఉంది. ఇప్పుడు నేరుగా వైసీపీ అభ్యర్థిని గెలిపించండి అంటూ చెప్పటంతో అల్లు అర్జున్ పట్ల మెగా అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.