
తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్
హైదరాబాద్, మే 11
రెండు జాతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీఆర్‌ఎస్‌కు వస్తున్నాయి. ఆ రెండు పార్టీల వైఫల్యాలను మేము అద్భుతంగా ప్రజలకు వివరించాం.
అర్భక ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. వాళ్ల ప్రభుత్వానికి పాలసి లేదు.
చిల్లర రాజకీయాల కోసం సమయాన్ని వృథా చేశారు. శ్వేతపత్రాలు అని పెట్టి చిల్లర రాజకీయాలు చేశారు. మాట్లాడకూడని భాష మాట్లాడారు.
సరూర్‌నగర్ స్టేడియంలో రాహుల్ సభకు కనీసం 2, 3 వేల మంది రాలేదు. సీఎం సభలకు కూడా జనాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికల ప్పటి జోష్ కాంగ్రెస్‌లో లేదు.