
రాష్త్ర వ్యాప్తంగా ఆన్ లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, సెప్టెంబర్ 16
కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో లక్ష మంది విద్యార్థులకు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ఆన్ లైన్లో శిక్షణ ఇవ్వనుంది.శిక్షణ కోసం రాష్త్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ శిక్షణ కోసం ఇంజినీరింగ్ , డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సరికొత్త సాఫ్ట్ వేర్ టెక్నాలజీలలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని అందిస్తోంది.

సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్ తదితర వంద కోర్సుల్లో శిక్షణ కల్పించనున్నారు. అదనపు కోర్సులలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైన్ కోర్సు లతో పాటు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సుల నుంచి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందించడంతో పాటు పరీక్షలను నిర్వహిస్తారు. పాస్ అయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందజేస్తారు. కోర్సు వ్యవధి 2 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. సబ్జెక్ట్‌లో ఇన్ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు విద్యార్థులకు ఇది చక్కటి అవకాశంగా నిలువనుంది.

ఈ ప్రోగ్రామ్ ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ, దివ్వాంగులు, మహిళా అభ్యర్థులు, మాజీ సైనికుల పిల్లలు స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద 80% ఫీజు రాయితీ ఉంటుందని తెలిపారు.అసక్తి గత అభ్యర్థులు ఈనెల 30లోగా www.nationalskillacademy.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

వివరాలకు సాయి శ్రీమాన్ రెడ్డి (ప్రోగ్రాం కోఆర్డినేటర్)
నేషనల్ స్కిల్ అకాడమీ) ఫోన్ 9505800050, 9505800047 నంబర్ పై సంప్రదించండి