
కేంద్రమంత్రికి సెపక్ తక్ర స్టేట్ ప్రెసిడెంట్ పెరిక సురేష్ వినతి
హైదరాబాద్, డిసెంబరు 18
సెపక్ తక్ర క్రీడకు ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అఫిలియేషన్ కల్పించాలని సెకప్ తక్ర అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ పెరిక సురేష్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ని కోరారు. ఈ మేరకు పెరిక సురేష్ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ఐ ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ క్రీడల్లో యువతను ప్రోత్సహించడంలో మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుందని తెలిపారు. యువతకు క్రీడలపట్ల ఆసక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ క్రీడను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్తో అఫిలియేషన్ ఇవ్వడంతో మరింత ప్రోత్సహం కల్పించిన వారవుతారని కేంద్ర మంత్రిని కోరారు. సెపక్ తక్రాను భారత ఒలింపిక్ సంఘంతో అఫిలియేషన్ ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేసస్తానని మంత్రి బండి వారికి హామీ ఇచ్చారు.కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఇంటర్నేషనల్ సెపక్ తక్ర ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఆర్ ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.