
సబ్సిడీతో టెర్రస్ గార్డెన్లను ప్రమోట్ చేస్తున్నాం
ట్రెస్ నుంచి ఉపశమనం పొందాలంటే గ్రీనరీ అవరసం
ఎంత స్థలం ఉంటే అన్ని మొక్కలు పెంచాలి
హార్టీకల్చర్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
17వ గ్రాండ్ నర్సరీమేళాను ప్రారంభించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, జనవరి 30
పట్ణ ప్రాంతాల్లో ప్రజలు చెట్లు పెంచుకునేలా సబ్సిడీ అందిస్తూ ఈ ఏడాది నుంచీ టెర్రస్ గార్డెన్లను ప్రమోట్ చేస్తున్నామనీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజాలో 17వ గ్రాండ్ నర్సరీమేళా పేరుతో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా హార్టీకల్చర్ షోను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..హార్టీకల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున రూఫ్ గార్డెన్స్ ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ప్రజలు ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా కూరగాయలతో పాటు పచ్చదనంగా ఉండేలా మొక్కలు పెంచాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంత ప్రజలు ఉదయం నుంచి ఉద్యోగాలు చేసి ట్రెస్ కు గురై సాయంత్రం ఇంటికి వెళ్ళి టెర్రస్ పై కూర్చుంటే ఆహ్లాదంగా గడిపేలా గార్డెన్ యేర్పాటు చేసుకోవాలి. ఎంత స్థలం ఉంటే అన్ని మొక్కలు పెంచుకొని పచ్చదనాన్ని పెంపొందించడం పట్టణ ప్రజలకు ఎక్కువ ఉపయోగమని చెప్పారు. మానవ జీవితానికి, మనుగడకు పచ్చదనం కావాలనీ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు పెంచడం అనివార్యం అని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో ఎలా అయితే వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయో అలాగే పట్టణ ప్రాంత ప్రజలు వీలయినంత ఎక్కువగా గ్రీనరీ పెంచు కోవాలన్నారు. వ్యవసాయం చేసుకునే వారికి ఏ జబ్బులు రావు, తిని కూర్చునే వారికే అన్ని జబ్బులు వస్తున్నాయి. పొల్యూషన్ నుంచి ఉపశమనం పొందడానికి రూఫ్ గార్డెన్, వర్టికల్ గార్డెన్స్ ఇలా ఇంటినిండా మొక్కలు పెంచుకోవాలనే ప్రజల ఆకాంక్షను చూస్తున్నామన్నారు. నర్సరీ ప్రేమికుల కోసం దేశ, విదేశాల నుంచి అరుదైన మొక్కలు, విత్తనాలు తీసుకువచ్చి ఒక వేదికగా నర్సరీ మేళాలో అందించడం అభినందనీయమని అన్నారు.



నర్సరీమేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ…నర్సరీ మేళాలో దేశ విదేశాల నుంచి 150స్టాల్లలో అందమైన పూలమొక్కలు తక్కువ ధర రూ.20 పాటు, రూ.2.50లక్షల ఖరీదైన మొక్కల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొక్కలను పెంచడానికి కావాల్సిన మెటీరియల్స్, ఆర్గానిక్ ఎరువులు, ఫెర్టిలైజర్స్, టెర్రకోట కుండీలు అందుబాటులో ఉంటాయనీ వివరించారు. కిచెన్ గార్డెన్, ఆర్ణమెంటల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, చెట్లను పెంచడానికి కావాల్సిన మెటీరియల్ ను ప్రమోట్ చేసే విధంగా ఎగ్జిబిట్ చేయడం జరిగిందని వివిధ రాష్ట్రాల నుంచి ఎగ్జిబిట్స్ వచ్చాయని వివరించారు.ఈ కార్యక్రమంలో హార్టీకల్చర్ ఆఫీసర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


