
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ బాధ్యతల స్వీకారం
సత్కరించిన ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా నెంబర్ పెరిక సురేష్
హైదరాబాద్, డిసెంబరు 15
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీహార్ మంత్రి నితిన్ నబిన్‌ను నియమించిన నేపథ్యంలో ఓబీసీ నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పెరిక సురేష్ నితిన్ నబిన్‌ను కలిసి శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

“బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబిన్ కి హృదయపూర్వక అభినందనలు. బీజేపీ యువమోర్చాలో సేవలు అందించిన ఆయన బీహార్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ బలోపేతమైంది. అదే స్ఫూర్తిని నితిన్ నబిన్ మరింత ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నాను” అని పెరిక సురేష్ పేర్కొన్నారు.

కార్యకర్తగా ఎదిగి కీలక పదవి అందుకున్న నితిన్ నబిన్‌ను అభినందిస్తూ, ఆయన అత్యంత పిన్న వయస్కుడైన యువ నాయకుడిగా, కష్టపడి పనిచేసే కార్యకర్తగా తనను తాను నిరూపించుకున్నారని సురేష్ కొనియాడారు. బీహార్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు సంస్థాగత అనుభవం అపారంగా ఉందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో శ్రద్ధ వహించారని ప్రశంసించారు.

“ఆయన వినయపూర్వక స్వభావం, క్షేత్రస్థాయి పని శైలి, అంకితభావం రానున్న రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేస్తాయి. జాతి నిర్మాణంలో బీజేపీ సమష్టి నిబద్ధత మరింత బలపడుతుంది” అని సురేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.
