
45 మంది అధికారులకు కొత్త బాధ్యతలు
తెలంగాణలో భారీ ఐఏఎస్ బదిలీలు: 45 మంది అధికారులకు కొత్త బాధ్యతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అవసరాల దృష్ట్యా భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో కీలక శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ సంస్థల ఎండీలు, కమిషనర్లు ఉన్నారు.

ఐఏఎస్ ల బదిలీలు:
- సంజయ్ కుమార్: పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ (PR & RD), రూరల్ వాటర్ సప్లై అండ్ సానిటేషన్ (RWS&S) శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ అయ్యారు.
- సబ్యసాచి ఘోష్: ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ స్కీమ్స్ యూనిట్‌తో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) బాధ్యతలు అప్పగించబడ్డాయి.
- ఎం. దాన కిషోర్: లేబర్, ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యతలు.
- ఎన్. శ్రీధర్: ఐటీ & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు.
- రాహుల్ బొజ్జా: జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ; బీసీ వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యత.
- ఈ. శ్రీధర్: ఇరిగేషన్ & క్యాడ్ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
- గౌరవ్ ఉప్పల్: ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు; టీజీఆర్‌ఏసీ ఈఓ డీజీగా అదనపు బాధ్యత.
జిల్లా కలెక్టర్లలో మార్పులు:
- యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఎం. హనుమంతరావును ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో అనురాగ్ జయంతి కొత్త కలెక్టర్‌గా నియమితులయ్యారు.
- మహబూబ్‌నగర్ కలెక్టర్ బి. విజయేంద్రను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియమించారు. కొత్త కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా నియమితులయ్యారు.
- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. కొత్త కలెక్టర్‌గా చిత్ర మిశ్రా నియమితులయ్యారు.
- జనగాం కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా, నారాయణపేట్ కలెక్టర్‌గా ప్రతీక్ జైన్, మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరిష్, హనుమకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిట్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా గరిమా అగర్వాల్, వికారాబాద్ కలెక్టర్‌గా దీపక్ తివారీ, మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్ వంటి కొత్త నియామకాలు జరిగాయి.

ఇతర ముఖ్యమైన నియామకాలు:
- జితేష్ వి. పాటిల్ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా, ముషారఫ్ అలీ ఫరూకీ మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ అయ్యారు.
- డి. దివ్య సర్ప్ సీఈఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యత.
- అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ (ఢిల్లీ) సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా.
ఈ బదిలీలు పరిపాలనా సౌలభ్యం, కీలక శాఖల్లో సమర్థవంతమైన అమలు, జిల్లాల సమతుల్య అభివృద్ధి దృష్ట్యా చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలుస్తోంది.
