
వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్, ఫిబ్రవరి 26: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ప్రముఖ మంగళగౌరీ వస్త్ర దుకాణంలో కాసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం నుంచి భగ్గుమని మంటలు ఎగిసిపడుతున్నాయి.
దుకాణందారులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రమాదానికి కారణం ఏమిటనేది, ఎంత మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది, ప్రాణ నష్టం ఉందా లేదా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. సంఘటన స్థలంలో పోలీసులు, అగ్నిమాపక అధికారులు తీవ్రమైన విచారణ చేపట్టారు.
మరిన్ని వివరాలు వెల్లడవ్వగానే ప్రత్యేక వార్తలు అందిస్తాము.
