
హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రాఘవులు దేవళ్ల విజయం సాధించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోలింగ్‌కు సంబంధించిన ఫలితాలను మంగళవారం ప్రకటించారు.
రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 55 మంది మహిళలు సహా 203 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం, 23 మంది బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ మంగళవారంతో పూర్తయింది. విడుదలైన ఫలితాల్లో రాఘవులు దేవళ్ల గెలుపొందారు.
ఇంతకుముందు డిఆర్‌టి (డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్) జనరల్ సెక్రటరీగా సేవలందించిన రాఘవులు దేవళ్లకు విజయం అనంతరం న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు జీకే దేశ్‌పాండే, విజయ్ కుమార్, శ్రీధర్ రెడ్డి తదితరులు శాలువా కప్పి అభినందించారు.
ఈ సందర్భంగా రాఘవులు దేవళ్ల మాట్లాడుతూ, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అడ్వకేట్ల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు.
