
శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ లక్ష్మణ్, పెరిక సురేష్
న్యూఢిల్లీ: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమర్‌పాల్ మౌర్యకు ఓబీసీ మోర్చా జాతీయ సోషల్ మీడియా సభ్యుడు పెరిక సురేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలో అమర్‌పాల్ మౌర్యను వ్యక్తిగతంగా కలుసుకున్న పెరిక సురేష్ ఆయనకు అభినందనలు తెలియజేశారు.

బీజేపీ ఓబీసీ మోర్చా మాజీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ సమక్షంలో అమర్‌పాల్ మౌర్యకు బాధ్యతల అధికారిక అప్పగింత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓబీసీ వర్గాల నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ సంస్థాగత విస్తరణకు ఆయన కృషి చేయాలని పెరిక సురేష్ ఆకాంక్షించారు.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన అమర్‌పాల్ మౌర్య క్షేత్రస్థాయి కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం ఆయన అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వం, పార్టీ పట్ల విధేయతకు నిదర్శనమని పెరిక సురేష్ పేర్కొన్నారు.

ఓబీసీల సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఓబీసీ మోర్చాను బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. అమర్‌పాల్ మౌర్య నాయకత్వంలో ఓబీసీ మోర్చా మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని, ఆయనకు భవిష్యత్తులో గొప్ప విజయాలు లభించాలని పెరిక సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.

