ఆకట్టుకుంటున్న హార్టీకల్చర్ షో
టెర్రస్ గార్డెనింగ్పై అర్భన్ ప్రజల ఆసక్తి
గ్రీనరీపై పెరుగుతున్న మక్కువ
హైదరాబాద్: కాంక్రీట్ జంగిల్ మారిన నగర జీవనంలో పచ్చదనం క్రమంగా తగ్గిపోతున్న వేళ.. ఇంటి ఆవరణలో ఓ మొక్క, మిద్దెపై ఓ తోట, బాల్కనీలో కొన్ని పూల మొక్కలు పెంచాలనే ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఈ ఆసక్తికి మరింత ఊతమిచ్చేలా హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ఉన్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో జరుగుతున్న 20వ గ్రాండ్ నర్సరీ మేళా–ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో సందర్శకులను ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అరుదైన, అలంకరణ, ఔషధ, పూల మొక్కలు ఒకే వేదికపై కొలువుదీరడంతో మేళా మొక్కల ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఒకే చోట.. ఎన్నో రకాల మొక్కలు
ఈనెల 31 వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతున్న హార్టీకల్చర్​షో లో 140కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. డార్జిలింగ్, కోల్‌కతా, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, ముంబయి, బెంగళూరు, పుణే, షిర్డీ, చెన్నైతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వివిధ రకాల మొక్కలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పూల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, బోన్సాయ్, అలంకరణ మొక్కలు మాత్రమే కాకుండా టెర్రస్ గార్డెనింగ్, వెర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్ గార్డెనింగ్‌కు అనువైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. దీంతో చిన్న బాల్కనీ నుంచి విశాలమైన మిద్దె వరకు.. తమకు అనువైన గార్డెనింగ్‌ఎంపికలను సందర్శకులు పరిశీలిస్తున్నారు.అరుదైన, ప్రత్యేకమైన మొక్కలతో పాటు ఇంటి అలంకరణకు సరిపోయే మొక్కలు అందుబాటులో ఉండటం గ్రీనరీ ప్రియులను ఆకర్షిస్తోంది. గార్డెనింగ్‌కు అవసరమైన కుండీలు, టెర్రకోట సామగ్రి, ఆర్గానిక్ ఎరువులు, ఫెర్టిలైజర్లు ఒకే చోట లభిస్తుండటంతో మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్నవారికి మేళా వేదికగా మారింది.

ప్రతి ఇంటా గ్రీనరీ
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడికి మొక్కల పెంపకం ఒక ఆహ్లాదకరమైన పరిష్కారంగా నిలుస్తోంది. ఇంటి పరిసరాల్లో పచ్చదనం పెంచడంతో మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందనే అవగాహన ప్రజల్లో పెరుగుతోంది. మొక్కల సంరక్షణను ఓ వ్యాపకంగా మార్చుకుంటే ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా వినియోగించుకోవచ్చనే గ్రీనరీ ప్రియులు అంటున్నారు. మొక్కల పెంపకం, టెర్రస్ గార్డెనింగ్ సంస్కృతికి వేదికగా మారుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన మొక్కలు, అరుదైన జాతులు, గార్డెనింగ్ సామగ్రితో నర్సరీ మేళా సందడిగా మారింది.. ఇంటి అందాన్ని పెంచుకోవాలనుకునేవారికి, టెర్రస్పై గార్డెన్ ఏర్పాటు చేయాలనుకునేవారికి, అరుదైన మొక్కల సేకరణపై ఆసక్తి ఉన్నవారికి నర్సరీ మేళా వన్ స్టాప్ సొల్యూషన్గా నిలుస్తోంది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text