
పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత
హైదరాబాద్, జులై13
మహిళా సినీ నిర్మాత పట్ల ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఉదంతం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో నివాసముంటున్న గంగిరెడ్డి పల్లవి సినీ నిర్మాత. ప్రతిరోజు సాయంత్రం కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం వెలుతుంది. కాగా, ఈనెల 9న ఓ వ్యక్తి వర్నా కారులో వచ్చి ఆమె పార్కు నుంచి బయటకు వస్తుండగా మొబైల్ తో ఫోటోలు తీసాడు. ఇలా రెండు మూడుసార్లు జరగటంతో ఆమె గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 354, 354డి, 509 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
