
ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు
హైదరాబాద్, జులై 25
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు పై అనర్హత వేటు వేసింది. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వనమా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. దీనిపై సమీప అభ్యర్థి అప్పటి టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన జలగం వెంకట్రావ్ కోర్టును ఆశ్రయించారు. వనమా వెంకటేశ్వరరావు గెలిచిన తరువాత టీఆర్ఎస్ లో చేరారు. కాగా తాజాగా మంగళ వారం ఈమేరకు తీర్పిచ్చిన ధర్మాసనం.. 2018 డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావే ఎమ్మెల్యే అని ప్రకటించింది.