కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన యాజమాన్యం
త్వరలో దసరా, దీపావళి బోనస్‌ల చెల్లింపునకు సింగరేణి సిద్ధం : డైరెక్టర్ ఎన్.బలరామ్
హైదరాబాద్, సెప్టెంబర్ 21:
ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి 39413 మంది ఉద్యోగులకు రూ.1450 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది.సగటున ఒక్కో కార్మికుడికి రూ.3.70లక్షల ఎరియర్స్ అందనున్నాయి. గురువారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా 39 వేల 413 మంది కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ ఎరియర్స్ నిధులను జమ చేశారు.
9.91 లక్షలతో సింగరేణి టాపర్ గా సుదర్శన్ రెడ్డి
గురువారం ప్రకటించిన 11 వ వేజ్ బోర్డు ఎరియర్స్ పొందిన వారిలో అత్యధికంగా రూ.9.91 లక్షలు పొందిన రామగుండం=1 ఏరియా కు చెందిన వేముల సుదర్శన్ రెడ్డి సింగరేణి టాపర్ గా నిలిచారు. రెండవ స్థానంలో రూ.9.35 లక్షలతో రామగుండం 2 ఏరియాకి చెందిన ఈఇపీ ఆపరేటర్ మీర్జా ఉస్మాన్ బేగ్ ఉండగా, మూడో స్థానంలో రూ.9.16 లక్షలతో శ్రీరాంపూర్ ఏరియాలో హెడ్ ఓవర్ మెన్ గా పనిచేస్తున్న ఆడెపు రాజమల్లు నిలిచారు. అన్ని ఏరియాల్లో అత్యధిక ఎరియర్స్ పొందిన ఉద్యోగులను ఏరియాలో జనరల్ మేనేజర్లు ఘనంగా సన్మానించి చెక్కులని అందజేశారు. సింగరేణి యాజమాన్యం ఒకేసారి ఎరియర్సు చెల్లించడం పట్ల సింగరేణి ఉద్యోగులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సింగరేణి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ఎరియర్స్ విడుదల చేశారు. ఈ సదర్భంగా డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేష్
ఎరియర్స్ చెల్లింపుపై సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ,డైరెక్టర్ ఎన్.బలరామ్ కు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.