
లాభాల్లో వాటా 32%
కార్మికులకు రూ.711కోట్లు
నికర లాభాలు రూ.2221.87కోట్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 26:
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పంది. సింగరేణి సంస్థ 2022-=23 ఆర్ధిక సంవత్సరానికి వచ్చిన లాభాల్లో వాటాగా 32 శాతం కార్మికులకు, ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది. మంగళవారం ఈ మేరకు సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంధనశాఖ స్పెషల్ సీఎస్‌కు కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు సింగరేణి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చిన రూ.2221.87 కోట్ల నికర లాభాల్లో 32 శాతం అంటే రూ.711 కోట్లను ఇవ్వాలని నిర్ణయించారు. సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగరావు ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ సునీల్‌శర్మకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ప్రకటించిన 32శాతం వాటాను సింగరేణీ కార్మికులు,ఉద్యోగుల ఖాతాలో రూ.711 కోట్ల నిధులను జమ చేయనున్నట్లు సింగరేణి వర్గాలు తెలిపాయి.

