
*ఎలక్ట్రికల్ వైరింగ్‌లో నాణ్యత అవసరం
*నాణ్యమైన పరికరాలు వాడాలి
*నాణ్యత లేకే విద్యుత్ ప్రమాదాలు
*రాష్ట్ర లైసెన్సింగ్ బోర్డ్ మెంబర్ నేమాల బెనర్జీ
*బెనర్జీకి బీగ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల సత్కారం
హైదరాబాద్, జనవరి 22
విద్యుత్ కాంట్రాక్టర్లు మెరుగైన నాణ్యమైన పరికరాలు వాడి విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా అరికట్టాలని రాష్ట్ర లైసెన్సింగ్ బోర్డు నూతన మెంబర్ నేమలాల బెనర్జీ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓహోటల్‌లో రాష్ట్ర లైసెన్సింగ్ బోర్డు మెంబర్‌గా ఎన్నికైన నేమాల బెనర్జీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వైరింగ్, మెటీరియల్‌లో నాణ్యమైన ప్రమాణాలు పాటించాలని కోరారు.

ఈ సందర్భంగా విద్యుత్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించేలా కృషి చేయాలని బీ గ్రేడ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రఘు. సయ్యద్ బాషా, మల్లేష్ యాదవ్, ఉదయ భాస్కర్. కొండా బాల్ రెడ్డి, ఆర్. శ్రీనివాస్. పొదిల గోవర్ధన్ కాశి నాయుడు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
