
హైదరాబాద్, జనవరి 25
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరు ఆపలేరని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ స్పష్టం చేశారు.అయోధ్య ఆలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో 1008 దంపతులతో9 రోజుల పాటు నిర్వహించిన శ్రీరామ హనుమాన్ మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొని మహా ప్రసాదాన్ని బీజేపీ నేతలకు అందించారు. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, పార్టీ క్యాంపెయిన్ చైర్మన్ ఈటల రాజేందర్‌లకు ప్రసాదాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ జనవరి 14 మకరసంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ట 22 వరకు పాల్గొనే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా చెప్పారు. ఆయోధ్య క్షేత్ర తీర్థ ట్రస్ట్ చంపక్ రాయ్ ఆధ్వర్యంలో శ్రీరాం భద్రాచార్య, బాగేశ్వర దామ్ దీరేంద్రశాస్త్రీ, సమక్షంలో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు నిత్యం 9రోజుల పాటు హోమాల్లో పాల్గొని పూర్ణాహుతి సమర్పించి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నట్లు వివరించారు. అయోధ్య ఆలయ నిర్మాణం నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో రాబోయే లోక్‌సభ ఎన్నికలు రామరావణ యుద్దం కాగలదని పెరిక సురేష్ అన్నారు. రాష్ట్రంలో 10సీట్లకు పైగా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

