
సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్, డిసెంబర్ 15,2024
సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీగా పీ సురేష్ ఎన్నికైయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన యానివల్ జనరల్ బాడీ మీటింగ్లో నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఫెడరేషన్ జాతీయ అధ్యక్షునిగా యోగేంద్రసింగ్ దయాను ఎన్నుకోగా, సెక్రటరీగా సురేష్ ఎన్నికైయ్యారు. సురేష్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఇంటరేషనల్ సెపక్ తక్రా ఫెడరేషన్(ఐఎస్టీఏఎఫ్) జనరల్ సెక్రటరీ దటుక్ అబ్ధుల్ హలిమ్ బిన్ కదర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరుగగా ఇంటర్నేషనల్ వైఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ ఆర్ ప్రేం రాజ్ ఎన్నికల అబ్జర్వర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి గోవా మాజీ డిప్యూటీసీఎం చంద్రకాంత్ కల్వేకర్, వైఎస్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్ , జీ. శ్రీనివాసులు, తెలంగాణ సెక్రటరీ బీ శ్రీనివాస్రెడ్డి హా. జరైయ్యారు. ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి సెపక్ తక్రా క్రీడను మరింత విస్తృతం చేస్తామని ప్రకటించారు. సెపక్ తక్రా క్రీడను ప్రజల్లోకి తీసుకువెళ్లి యువతను ప్రోత్సహిస్తామని తెలిపారు.

సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గం ఎన్నిక సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పుష్పగుచ్చంతో సత్కరిస్తున్న దృశ్యం చిత్రంలో పీ సురేష్ తదితరులు