
నెక్కొండలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (GMPS) మండల కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం
నెక్కొండ, నవంబర్ 4: నెక్కొండ మండలంలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (GMPS) మండల కమిటీ ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికలను వరంగల్ జిల్లా కార్యదర్శి పరిచికి మధుకర్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నెక్కొండ పట్టణ గెస్ట్ హౌస్ ఆవరణలో నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన గొల్ల, కురుమ సమాజ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ, సంఘం ద్వారా పెంపకందార్ల సంక్షేమ కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాలని, సభ్యుల మధ్య ఐక్యతతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
తదుపరి నూతన మండల కమిటీని ప్రకటించారు.
మండల కమిటీ పదవులు ఈ విధంగా ఉన్నాయి:
- గౌరవ సలహాదారు: దవనబోయిన వీరభద్రం
- గౌరవ అధ్యక్షుడు: బొమ్మనబోయిన రమేష్
- మండల అధ్యక్షుడు: కోరే యాదగిరి
- ఉపాధ్యక్షుడు: దొంగల వేణు
- ప్రధాన కార్యదర్శి: బోళ్ల భూపాల్
- సహాయ కార్యదర్శులు: కాశపోయిన కుమార్, కన్నబోయిన వెంకన్న
- కోశాధికారి: కోల వెంకన్న
- సోషల్ మీడియా కన్వీనర్: దయ్యాల వెంకన్న
కమిటీ సభ్యులు: బొడ్డు రవి, బోళ్ల రమేష్, ఒర్రే ఆడిత్, బోళ్ల శివకుమార్, జక్కుల రాజు.
సలహాదారులు: గడ్డాల సతీష్, బోడగొండ కుమారస్వామి, దయ్యాల బిక్షపతి, అమ్మ కట్టయ్య, అన్న అనిల్, దయ్యాల వెంకన్న.
మొత్తం 21 మంది సభ్యులతో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన మండల అధ్యక్షుడు కోరే యాదగిరి, కార్యదర్శి బోళ్ల భూపాల్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
