సెపక్‌తక్రా పురుషుల క్వాడ్రంట్‌ విభాగంలో టీమ్‌ ఇండియా సత్తా
అభినందనలు తెలిపిన మంత్రి వాకిటి శ్రీహరి బృందం
హైదరాబాద్:
జపాన్‌లో జరుగుతున్న ఆయిచి–నగోయా 2026 ఆసియా క్రీడల్లో భారత సెపక్‌తక్రా జట్టు సత్తా చాటింది. పురుషుల క్వాడ్రంట్‌ సెపక్‌తక్రా విభాగంలో టీమ్‌ ఇండియా కాంస్య పతకం సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆతిథ్య జట్టు జపాన్‌తో భారత్‌ తలపడింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత ఆటగాళ్లు తీవ్రంగా పోరాడినప్పటికీ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఎ.పి. జితేందర్‌ రెడ్డి, సెపక్‌తక్రా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తొలి జాయింట్‌ సెక్రటరీ జనరల్‌, తెలంగాణ సెపక్‌తక్రా సంఘం అధ్యక్షుడు పెరిక సురేష్ భారత జట్టును అభినందించారు. భారత సెపక్‌తక్రా జట్టు సాధించిన కాంస్య పతకం దేశానికి గర్వకారణమని, అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఈ విజయం దోహదపడుతుందని పెరిక సురేష్ వెల్లడించారు.


స్కోర్: భారత్–జపాన్ పురుషుల క్వాడ్రంట్ సెమీఫైనల్ స్కోర్
భారత్ 0–2 జపాన్
మొదటి సెట్: భారత్ 12–15 జపాన్
రెండో సెట్: భారత్ 13–15 జపాన్
మ్యాచ్ ఫలితం: రెండు సెట్లలోనూ భారత్ 2 పాయింట్ల తేడాతోనే ఓటమి పాలైంది. జపాన్ 2–0తో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. భారత్‌కు కాంస్య పతకం దక్కింది.
భారత జట్టు: మలేమగంబా సింగ్, సరోఖైబం, రాంకుమార్ శర్మ, బాబీ కుమార్, అకాష్ యమ్నం, లఖన్సింగ్ ఇలాంగబం, టేకంగ్ అరుణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text