
హైదరాబాద్: పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సర్వీసులో రమణ గౌడ్ తనకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణ, నిబద్ధతతో నిర్వహించారని సహచర అధికారులు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ, నేరాల నియంత్రణతో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ బాధ్యతలను ఆయన నిబద్ధత నిర్వహించారు. రమణగౌడ్కు ఉన్న సుదీర్ఘ అనుభవం, పోలీసింగ్‌పై అవగాహన, పరిజ్ఞానం సహచర అధికారులు, సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడ్డాయని పలువురు పేర్కొన్నారు.

విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు ప్రజల పట్ల మానవతా దృక్పథాన్ని పాటించారని గుర్తుచేశారు. పోలీస్ శాఖకు ఆయన అందించిన సేవలు గుర్తించదగినవని అధికారులు, సహచరులు పేర్కొన్నారు.
