
ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్‌కు ఘన స్వాగతం
నాగోయాలో ఐసీసీ చైర్మన్ జై షాకు ప్రోటోకాల్ అధికారిగా పెరిక సురేష్ స్వాగతం
నాగోయా, అక్టోబర్ 3: జపాన్‌లో జరుగుతున్న ఆయిచి–నాగోయా 2026 ఆసియా క్రీడల్లో భాగంగా భారత్–పాకిస్థాన్ మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ చైర్మన్ జై అమిత్ షా హాజరయ్యారు. నాగోయాలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు విచ్చేసిన జై షాకు ఆసియా క్రీడల చీఫ్ ప్రోటోకాల్ అధికారి పెరిక సురేష్ ఘన స్వాగతం పలికారు.

ఆయిచి–నాగోయా 2026, 20వ ఆసియా క్రీడల నిర్వహణలో చీఫ్ ప్రోటోకాల్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పెరిక సురేష్.. అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల రాక, ప్రోటోకాల్ వ్యవహారాలను సమన్వయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐసీసీ చైర్మన్ జై షాకు స్వయంగా స్వాగతం పలకడం విశేషంగా నిలిచింది.
భారత్–పాకిస్థాన్ మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆసియా క్రీడల వేదికపై ఇరు దేశాల క్రికెట్ జట్లు తలపడటం అంతర్జాతీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు ఐసీసీ చైర్మన్ హాజరుకావడంతో కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్‌లో చీఫ్ ప్రోటోకాల్ అధికారిగా పెరిక సురేష్ నిర్వహిస్తున్న బాధ్యతలు తెలంగాణకు కూడా గర్వకారణంగా నిలుస్తున్నాయి.
