
@సెప్టెంబర్ రెండో వారం వరకు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం. @కనీసం ఉన్న నాలుగు నెలల టర్మ్ లోనైనా మాఫీ సాధ్యమా?
@నాలుగున్నర ఏళ్లలో మాఫీ అయింది రూ.1,207 కోట్లు
@రూ.లక్ష మాఫీలో రూ.37వేల వరకే మాఫీ
@ఇప్పటి వరకు 5.66లక్షల మందికే మాఫీ
హైదరాబాద్, ఆగస్టు02
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 03 తేదీ నుంచి రైతులకు సంబంధించిన పంట రుణాల మాఫీ ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ రెండో వారంలోగా రుణమాఫీ పూర్తి చేయాలని నిర్ణయించింది. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2024 జనవరి నెల వరకే గడువు ఉన్నది. ప్రకటించిన ఎన్నికల హామీ మేరకు ఈ నిర్ణీత గడువులోగా పంట రుణమాఫీ సాధ్యమయ్యే పరిస్థితి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నాలుగున్నర ఏళ్లకు పైగా కాని రుణాల మాఫీ 40రోజుల్లోనో లేక ఈ నాలుగు నెలల్లో సాధ్యమవుతోందో వేచి చూడాల్సిందే. ఇన్నాళ్లుగా పంట రుణాలు 6శాతమే మాఫీ చేసింది. ఇంకా 94శాతం రుణాల మాఫీ చేయాల్సి ఉంది.
పంట రుణాలు రూ.19198.38కోట్లు
రైతులు, వారి కుటుంబసభ్యులపై కలిపి మొత్తంగా రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.గత 2018 డిసెంబర్ 11ను కటాఫ్ తేదీగా నిర్ణయించింది. నిర్ణీత తేదీ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.25,936 కోట్ల లోన్లు ఉన్నట్లు ఎస్‌ఎల్‌బీసీ తేల్చింది. గత రెండేళ్ల క్రితం అయితే అందులో పంట రుణాలు, ఫ్యామిలీకి రూ.లక్ష మాఫీ నిబంధనల అమలులో 3 .98లక్షల మందికి పైగా అనర్హులుగా తేలింది. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు రుణమాఫీ అయింది రూ.1,207 కోట్లు..
లక్ష రూపాయల రుణమాఫీలో నాలుగు దఫాలుగా చేయాలని సర్కారు నిర్ణయించింది. కాగా ఫస్ట్ ఫేజ్‌లో రూ.25వేల వరకు 2.96లక్షల మంది రైతుల రుణాలు రూ.408.38కోట్లు మాఫీ జరిగింది. సెకండ్ ఫేజ్‌లో 2.70లక్షల మంది రైతులకు 36వేల వరకు ఉన్న రూ,770.40 కోట్ల రుణాలు మాఫీ జరిగింది. ఇలా మరి కొందరి మాఫీ జరుగుతూ ఈ నాలుగున్నర ఏళ్లలో ఇప్పటి వరకు 5.66లక్షల మంది రైతుల రుణాలు రూ.1,207 కోట్లు మాత్రమే మాఫీ జరిగింది. కాగా ఇంకా 31లక్షల మంది రైతులకు మాఫీ చేయాల్సి ఉంది.

ఇన్నాళ్లు బడ్జెట్ కేటాయింపులే నిధులు ఇయ్యలే..
రుణమాఫీకి ప్రతి బడ్జెట్ లోనూ సర్కార్ నిధులు కేటాయింస్తున్నది తప్ప వాటిని రిలీజ్ చేయలేదు. ఈ ఐదేళ్ల బడ్జెట్లలో మొత్తంగా రూ.26549.20కోట్ల కేటాయించింది. ఈ నిధులన్నీ విడుదల చేసి ఉంటే, ఈపాటికి రుణమాఫీ పూర్తయ్యేది. నాలుగు విడతల్లో మొత్తం లోన్లు మాఫీ చేస్తామన్న సర్కార్ నాలుగున్నర ఏండ్లలో రెండు విడుతలు కూడా పూర్తిగా మాఫీ చేయక పోవడం గమనార్హం. ఏటా బడ్జెట్ లో రుణమాఫీకి నిధులు కేటాయిస్తున్నప్పటికీ, వాటిని విడుదల చేయలేదు. ఈ ఐదేండ్ల బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ.26549.20కోట్లు కేటాయించినప్పటికీ, అందులో రూ. 1,207 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ జరిగింది.
